Chinukula Raali Song Lyrics Is A Romantic Song From Crime & Intrigue Movie. You Can Get Chinukula Raali Song Lyrics In Telugu Font. Chinukula Raali Song Lyrics PDF Please Join Our Telegram Channel. Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)
ARTIST Johnny Bernstein PRS
ALBUM WOMG 004 Crime & Intrigue
Chinukula Raali Song Lyrics In Telugu
చినుకులా రాలి..నదులుగా సాగి
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
నదివి నీవు..కడలి నేను
మరచి పోబోకుమా..మమత నీవే సుమా..
చినుకులా రాలి..నదులుగా సాగి..
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
ఆకులు రాలే వేసవి గాలి
నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసి వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే
నే వేచి ఉంటానులే..
జన్మలు తాకే ప్రేమను నేనై
నే వెల్లువౌతానులే..
ఆ చల్లనే చాలులే
హిమములా రాలి..సుమములై పూసి..
ఋతువులై నవ్వి.. మధువులై పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
శిశిరమైనా..శిథిలమైనా..విడిచి
పోబోకుమా.. విరహమై పోకుమా..
తొలకరి కోసం తొడిమెను
నేనై అల్లాడుతున్నానులే
పులకరమూదే పువ్వుల కోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై ఆ ముద్దు
తీరాలిలే..
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై వెలసి..గానమై పిలిచి
కలలతో అలిసి..గగనమై ఎగసి
నీ ప్రేమ.. నా ప్రేమ..తారాడే మన ప్రేమ..
భువనమైనా.. గగనమైనా..ప్రేమ
మయమే సుమా!ప్రేమ మనమే సుమా!
చినుకులా రాలి..
నదులుగా సాగి…
వరదలై పోయి..
కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ..నీ పేరే నా ప్రేమ
Popular Romantic Songs:
- Chinukula Raali Song Lyrics In Telugu
- Vintunnava Song Lyrics In Telugu
- Sasivadane Sasivadane Lyrics In Telegu – Iddaru Movie
- Padametu Potunna Song Lyrics In Telugu
- Jai Lava Kusa Song Lyrics In Telugu