Nirvana Shatakam Lyrics Is A Devotional Song. You Can Get Nirvana Shatakam Lyrics In Telugu Font. Nirvana Shatakam Song Lyrics PDF Please Join Our Telegram Channel. Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)
Nirvana Shatakam Lyrics In Telugu
మనో బుధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రె |
న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం ||
నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తము కూడా కాదు. నేను పంచేంద్రియాలైన చెవి, ముక్కు, కన్ను, నాలుక, చర్మం కూడా కాదు. నేను పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం కూడా కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
నచ ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః
న వా సప్తధాతు ర్నవా పంచ కోశాః |
నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ
చిదానంద రూపః శివోహం శివోహం ||
కీలకమైన ప్రాణాన్ని నేను కాదు. పంచవాయువులు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానలు) నేను కాదు, సప్త ధాతువులు (రక్త, మాంస,మేదో,ఆస్థి,మజ్జా,రస,శుక్రములు) నేను కాదు. పంచకోశాలు (అన్నమయ,ప్రాణమయ,మనోమయ, విజ్ఞ్యానమయ, ఆనందమయ) నేను కాదు. కర్మేంద్రియాలు (వాక్కు,పాణి,పాద,పాయు,ఉపస్థ) నేను కాదు.నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
న మే ద్వేషరాగౌ న మే లోభమోహో
మదో నైవ మే నైవ మాత్సర్యభావః |
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం ||
నాలో రాగద్వేషములు లేవు, లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధకామమోక్షాలు నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మన్త్రో న తీర్ధం న వేదా న యజ్ఞః |
అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా
చిదానంద రూపః శివోహం శివోహం ||
నాకు పుణ్యపాపాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు, తీర్థాలు, వేదాలు, యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాడిని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
న మే మృత్యు ర్న శంకా న మే జాతి భేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ |
న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం ||
నాకు జననమరణాలు లేవు. నాలో జాతి భేధాలు లేవు. నాకు తల్లిదండ్రులు లేరు. నాకు బంధుమిత్రులు లేరు. నాకు గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని. నేను శివుడిని.
అహం నిర్వికల్పో నిరాకార రూపో
విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ |
న చ సంగతం నైవ ముక్తిర్ న మేయ:
చిదానంద రూపః శివోహం శివోహం ||
నేను నిర్వికల్పుడను, ఆకారం లేనివాడను, సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్నాను, నాకు మోక్షము లేదు, బంధము లేదు, నేను చిదానంద రూపాన్ని. నేను శివుడిని, నేను శివుడిని.
Popular Devotional Songs:
- Durga Saptashloki Lyrics In Telugu
- Siluva Song In Lyrics Telugu
- Sayamkala Samayaml Song Lyrics Telugu
- Raja Nee Sannidhilone Lyrics In Telugu
- Hosanna Hosannaa Song Lyrics In Telugu