Rama Rama Rama Uyyalo Song Lyrics Is A Devotional Song. You Can Get Rama Rama Rama Uyyalo Song Lyrics In Telugu Font. This Song Is Sang By Aruna, And Traditional Written This Song. Rama Rama Rama Uyyalo Song Lyrics PDF Please Join Our Telegram Channel. Telegram – https://t.me/Telugulyrics10 (@Telugulyrics10)
Song Bathukamma Song – Rama Rama
Singer Aruna
Lyrics Traditional
Rama Rama Rama Uyyalo Song Lyrics In Telugu
రామ రామ రామ ఉయ్యాలో… రామనే శ్రీరామ ఉయ్యాలో
రామ రామ నంది ఉయ్యాలో… రాగమెత్తరాదు ఉయ్యాలో
నెత్తిమీద సూర్యుడా ఉయ్యాలో… నెల వన్నెకాడ ఉయ్యాలో
పాపట్ల చంద్రుడా ఉయ్యాలో… బాలకుమారుడా ఉయ్యాలో
పెద్దలకు వచ్చింది ఉయ్యాలో… పెత్తారామాస ఉయ్యాలో
బాలలకు వచ్చింది ఉయ్యాలో… బతుకమ్మ పండుగ ఉయ్యాలో
తెల్లతెల్లయి గుళ్లు ఉయ్యాలో… తెల్లయమ్మా గుళ్ళు ఉయ్యాలో
పన్నెండేండ్ల నాడు ఉయ్యాలో… పాతవడ్డ గుళ్ళు ఉయ్యాలో
తెల్లయి ఎములాడ ఉయ్యాలో… రాజన్న గుళ్ళు ఉయ్యాలో
నల్లనల్లయి గుళ్ళు ఉయ్యాలో… నల్లయమ్మా గుళ్ళు ఉయ్యాలో
నల్లయి నల్లగొండ ఉయ్యాలో… నరసింహా గుళ్ళు ఉయ్యాలో
పచ్చపచ్చయి గుళ్ళు ఉయ్యాలో… పచ్చయమ్మా గుళ్ళు ఉయ్యాలో
పచ్చయి పర్వతాల ఉయ్యాలో… మల్లన్న గుళ్ళు ఉయ్యాలో
పర్వతాల మల్లన్న ఉయ్యాలో… పదములు సెలవయ్యా ఉయ్యాలో
రామ రామ రామ ఉయ్యాలో… రామనే శ్రీ రామ ఉయ్యాలో ॥2॥
ఇద్దరక్కా చెల్లెళ్ల ఉయ్యాలో… ఒక్కూరికిస్తే ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో… సూసన్నా వోడాయే ఉయ్యాలో
ఎట్ల వత్తు చెల్లె ఉయ్యాలో… ఏరు అడ్డమాయే ఉయ్యాలో
ఏరుకు ఎలుపల్ల ఉయ్యాలో… తలుపు అడ్డమాయే ఉయ్యాలో
తలుపులకు తాళాలు ఉయ్యాలో… వెండి సీలలు ఉయ్యాలో
వెండి సీల కింద ఉయ్యాలో… వెలపత్తి చెట్టు ఉయ్యాలో
వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో… ఏడు విత్తులపత్తి ఉయ్యాలో
ఏడు గింజల పత్తి ఉయ్యాలో… ఎల్లనే ఆ పత్తి ఉయ్యాలో
ఆ పత్తి తీసుకుని ఉయ్యాలో… ఏడికి వోయిరి ఉయ్యాలో
పాలపాల పత్తి ఉయ్యాలో… పావురాయి పత్తి ఉయ్యాలో
ముసల్ది వడికింది ఉయ్యాలో… ముద్దుల పత్తి ఉయ్యాలో
వయస్సుది వడికింది ఉయ్యాలో… వన్నెల పత్తి ఉయ్యాలో
చిన్నది వడికింది ఉయ్యాలో… చిన్నెల పత్తి ఉయ్యాలో
ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో… సాలె చింతల పత్తి ఉయ్యాలో
సాలె చింతలగాడ ఉయ్యాలో… సంగడి సారన్న ఉయ్యాలో
సంగడి సారన్న ఉయ్యాలో… సాగదీయ్యవట్టే ఉయ్యాలో
సాగదీయ్యవట్టే ఉయ్యాలో… ఆ పత్తి వడికి ఉయ్యాలో
ఆ పత్తి వడికిన ఉయ్యాలో… నెలకొక్క పోగు ఉయ్యాలో
దీవెనె ఆ చీర ఉయ్యాలో… దివిటీల మీద ఉయ్యాలో
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో… కొంగల బావికి ఉయ్యాలో
నీళ్లకంటూ పోతే ఉయ్యాలో… కొంగల బావికి ఉయ్యాలో
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో… హంసల బావికి ఉయ్యాలో
హంసలన్నీ చేరి ఉయ్యాలో… అంచునంతా చూసే ఉయ్యాలో
ఆ చీర కట్టుకుని ఉయ్యాలో… పట్నంబు పోతిని ఉయ్యాలో
పట్నంబు పారిని ఉయ్యాలో… కొంగు బంగారమే ఉయ్యాలో
కొంగు బంగారంబు ఉయ్యాలో… ఈ చీరలున్నాయా ఉయ్యాలో
గొప్పగా సాలెళ్ళు ఉయ్యాలో… నేసినారు ఈ చీర ఉయ్యాలో
దిగినే ఆ చీర ఉయ్యాలో… దివిటీల మీద ఉయ్యాలో
అన్నల ఓయన్నా ఉయ్యాలో… అన్నలో పెద్దన్న ఉయ్యాలో
ఏడాదికోసారి ఉయ్యాలో… బతుకమ్మ పండుగ ఉయ్యాలో
ఆడపిల్లలనన్నా ఉయ్యాలో… నేను ఉన్న జూడు ఉయ్యాలో
కలిగేను పెద్దమ్మ ఉయ్యాలో… కన్నెతల్లి ఉన్నదా ఉయ్యాలో
ఏడంత్రాల ఉయ్యాలో… తీరైన బతుకమ్మ ఉయ్యాలో
తీరైన బతుకమ్మ ఉయ్యాలో… పువ్వులే తెచ్చిరి ఉయ్యాలో
వారిద్దరొత్తురా ఉయ్యాలో… వీరిద్దరొత్తురా ఉయ్యాలో
సంవత్సరానికి ఉయ్యాలో… ఒక్కసారే తల్లే ఉయ్యాలో
తంగేడు పూలనే ఉయ్యాలో… రాశిగా తెచ్చిరి ఉయ్యాలో
పోయిరా బతుకమ్మ ఉయ్యాలో… మళ్లీ ఏడాదికి ఉయ్యాలో
మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో… మళ్లీ రావమ్మ ఉయ్యాలో
మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో… మళ్లీ రావమ్మ ఉయ్యాలో
మళ్లీ రా బతుకమ్మ ఉయ్యాలో… మళ్లీ రావమ్మ ఉయ్యాలో
Popular Devotional Songs:
- Durga Saptashloki Lyrics In Telugu
- Siluva Song In Lyrics Telugu
- Sayamkala Samayaml Song Lyrics Telugu
- Raja Nee Sannidhilone Lyrics In Telugu
- Hosanna Hosannaa Song Lyrics In Telugu